పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతికి రాష్ట్ర పండుగ హోదా..

కైకలూరు, ఆంధ్రప్రభ : అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రతి ఏడాది ఆగస్టు 7న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో శనివారం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రభుత్వం కల్పించిన ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.

సభలో అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ఆయుర్వేద వైద్య రంగంలో విశేష సేవలు అందించి, 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

ఆయన కృషి ఫలితంగానే 1927లో జి.ఓ. నెం. 271 ద్వారా “అగ్నికుల క్షత్రియులు” అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పొన్నమండ శ్యాంబాబు, మోకా వెంకటేశ్వరరావు, కొక్కలగడ్డ ఆంజనేయులు, తిరుమలశెట్టి ఈశ్వర్, పరశురాముడు, నడకుదుటి గణపతి, కొల్లాటి సత్యనారాయణ, పొన్నాల లక్ష్మణరావు, పొన్నమండ పెంటయ్య, వల్లభు రాజేష్, బొమ్మాడి సింహాచలం, తిరుమాని కృష్ణమూర్తితో పాటు కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అగ్నికుల క్షత్రియ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.