Gold-Price-Today -1-2026-Analysis | బంగారం ధర తగ్గింది… ఇప్పుడు కొనాలా? మరికొంత వేచి చూడాలా?
Gold-Price-Today -1-2026-Analysis | బంగారం ధర తగ్గింది… ఇప్పుడు కొనాలా? మరికొంత వేచి చూడాలా?
- పది గ్రాములకు రూ.380 తగ్గిన 24 క్యారెట్ల బంగారం..
- పది గ్రాములకు రూ.350 తగ్గిన 22 క్యారెట్ల బంగారం..
- డిజిటల్ గోల్డ్ ఎందుకు ఖరీదుగా ఉంది?
- అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాల ప్రభావం..
ముఖ్యాంశాలు
24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,422 (-రూ.38)
22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,220 (-రూ.35)
18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.10,816
స్పాట్ గోల్డ్, కామెక్స్ మార్కెట్లలో బలహీనత
MCX గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్
డిజిటల్ గోల్డ్ గ్రాముకు రూ.15,172
కొనుగోలుదారులకు స్వల్ప ఊరట.. కానీ మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది
Gold-Price-Today -1-2026-Analysis | ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి : బంగారం ధరలు రోజూ పెరుగుతూనే ఉంటాయనే అభిప్రాయానికి శనివారం (ఆగస్టు 1) మార్కెట్ కొంత విరామం ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.380, 22 క్యారెట్ల బంగారం రూ.350 మేర తగ్గింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్, కామెక్స్ ఫ్యూచర్స్ రెండూ తగ్గిన ధరలతో ట్రేడవుతుండటంతో దేశీయ ధరలపైనా దాని ప్రభావం కనిపించింది. బంగారం కొనుగోలుదారులకు కాస్తా ఊరటనిచ్చినప్పటికీ, ఇప్పుడు కొనాలా? వేచి చూడాలా? అనే సందిగ్ధ నెలకొంది.

ఈరోజు (1-8-26) బంగారం ధరలు
రకం గ్రాముకు 10 గ్రాములకు మార్పు
24 క్యారెట్లు రూ.14,422 రూ.1,44,220 -రూ.38
22 క్యారెట్లు రూ.13,220 రూ.1,32,200 -రూ.35
డిజిటల్ బంగారం ధర: గ్రాముకు రూ.15,172
స్పాట్ గోల్డ్: గ్రాముకు 130 అమెరికా డాలర్లు (1.85 డాలర్లు తగ్గుదల)
స్పాట్ గోల్డ్ (ఔన్స్): 4,043.36 డాలర్లు (57.75 డాలర్లు తగ్గింది)
కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్: ఔన్సుకు 4,031.70 డాలర్లు
గత 10 రోజుల ట్రెండ్ ఏమి చెబుతోంది?
గత పది రోజుల ధరలను పరిశీలిస్తే బంగారం ఒక్క దిశలో ప్రయాణించడం లేదని స్పష్టమవుతోంది. జులై 23న 24 క్యారెట్ల బంగారం రూ.14,618 వద్ద ఉంది. జులై 24న ఒక్కసారిగా రూ.185 తగ్గింది. తరువాత మళ్లీ కోలుకుని జులై 31న రూ.14,460 చేరింది. ఆగస్టు 1న మరోసారి రూ.38 తగ్గి రూ.14,422 వద్దకు వచ్చింది. అంటే మార్కెట్ ప్రస్తుతం భారీ హెచ్చుతగ్గుల దశలో కొనసాగుతోంది.
డిజిటల్ గోల్డ్ ఎందుకు ఖరీదుగా ఉంది?
చాలామందికి ఒక సందేహం ఉంటుంది. మార్కెట్‌లో గ్రాము బంగారం రూ.14,422 ఉండగా డిజిటల్ గోల్డ్ ఎందుకు రూ.15,172? దీనికి ప్రధాన కారణాలు… 3 శాతం GST , ప్లాట్‌ఫారమ్ సర్వీస్ ఛార్జీలు నిల్వ (Vault) ఖర్చులు
ప్రీమియం ధరలు అన్ని కలిపితే డిజిటల్ గోల్డ్ ధర సాధారణ మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
నగరం 24K 22K 18K
చెన్నై రూ.14,461 రూ.13,256 రూ.11,071
హైదరాబాద్ రూ.14,422 రూ.13,220 రూ.10,816
ముంబై రూ.14,422 రూ.13,220 రూ.10,816
బెంగళూరు రూ.14,422 రూ.13,220 రూ.10,816
కోల్‌కతా రూ.14,422 రూ.13,220 రూ.10,816
ఢిల్లీ రూ.14,437 రూ.13,225 రూ.10,816
అహ్మదాబాద్ రూ.14,427 రూ.13,225 రూ.10,821
ఇప్పుడు కొనాలా? వేచి చూడాలా?
ఇప్పటి పరిస్థితుల్లో ధరలు స్వల్పంగా తగ్గినా, దీన్ని భారీ పతనంగా భావించకూడదు. పెళ్లిళ్లు లేదా అత్యవసర అవసరం ఉంటే ప్రస్తుత ధరల్లో విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిది. పెట్టుబడిదారులు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా దశలవారీగా కొనుగోలు చేస్తే ధరల ఒడిదుడుకుల ప్రభావం తగ్గుతుంది. స్వల్పకాలిక ట్రేడర్లు అంతర్జాతీయ మార్కెట్, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ కదలికలను నిశితంగా గమనించాలి.
ముందు రోజుల్లో ధరలు ఎలా ఉండొచ్చు?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి అంశాలు రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి ఈరోజు కనిపించిన తగ్గుదలను ట్రెండ్ మారింది అని కాకుండా, స్వల్ప విరామంగా చూడాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
