ఘ‌నంగా ఎమ్మెల్యే జన్మదినం

  • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్ పంపిణీ

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలను తాడ్వాయి మండలంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిట్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రజాసేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్‌రెడ్డి, ఉపసర్పంచ్ మల్లేష్, ఏఎంసీ వైస్‌చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలమ్‌భాయ్, మండల ప్రధాన కార్యదర్శి విట్టల్, చిట్యాల గ్రామ అధ్యక్షుడు మ్యడం పెద్ద బాలయ్య, ఉపాధ్యక్షుడు గైని సాయిలు, సొంటికి పెద్ద సాయిలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణిశ్యాం కిషన్‌రావు, సలహాదారులు మనగారి దుర్గయ్య, మేడం కిషన్, వడ్లూరి రాములు, మహిళా అధ్యక్షురాలు విజయ, సారుగు మహేందర్, కమ్మరి లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.