పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం..
నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న
పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియామకానంతరం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో మర్యాదపూర్వక భేటీ
శాలువా, పూలమాల, బొకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన బుద్ధా వెంకన్న
పార్టీ బలోపేతం, అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని వ్యాఖ్య
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన అనంతరం జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న శనివారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి శాలువా కప్పి, పూలమాల వేసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ… పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
