వరద ఉద్ధృతి.. రాకపోకలకు అంతరాయం..

కుంటాల, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని లింబి (బి) గ్రామ సమీపంలోని లోలెవెల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓలా, లింబి (బి), చాతతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ ఆదముల్ల సుహాసిని, రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వంతెనపై వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఎవరూ దాటకుండా పంచాయతీ సిబ్బందిని అక్కడే నియమించి రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, వరద నీటి ప్రవాహంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సర్పంచ్ సుహాసిని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించి భద్రతా చర్యలు చేపట్టారు.