నకరికల్లులో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ!
నకరికల్లు, ఆంధ్రప్రభ : నకరికల్లు మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ, ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి ప్రయాణికులు స్పందించి ఆటోలో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన అనంతరం కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.
గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. గాయపడిన వారి వివరాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది.
