దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు

  • కుటుంబ సమేతంగా పూజలు..
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్, ఈవో

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు బుధవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం పాలక మండల చైర్మన్ బొర్రా గాంధీ ఈఓ శీనా నాయక్ అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం శ్రీ కన్నబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనానంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేయగా, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.