ఈదురుగాలులకు కూలిన చెట్లను పరిశీలించిన లక్ష్మణ్ బాబు

మంగపేట (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా మంగపేటలో మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా ఈదురుగాలులకు వందలాది చెట్లు నేలకూలిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బుధవారం పరిశీలించారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి మంగపేట నుంచి కోమటిపల్లి వెళ్లే మార్గంలోని సండ్రోని ఒర్రె సమీపం, శాంతినగర్ రహదారి వద్ద అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన సందర్శించారు.

మంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సెక్షన్, మంగపేట సౌత్ బీట్, కంపార్ట్‌మెంట్ నంబర్-5లో దుంపిడి, కానుగ, ముస్తి, ఈపీ తదితర జాతులకు చెందిన వృక్షాలు భారీ ఈదురుగాలుల కారణంగా నేలకూలిన విషయాన్ని అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్‌రావు, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, బాడిశా నాగరమేష్, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, గాదె శ్రీనివాసాచారి, ఎస్.కె. కుర్బాన్ అలీ, యలవర్తి శ్రీనివాసరావు, సోయం ఈశ్వర్, భోజారావు, సుంకోజు ప్రశాంత్, సాంబులు, వంశీ, సంతోష్, మహేష్, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.