టీడీపీ రెండేళ్ళ పాలన పైడోర్ టు డోర్..
నర్సాపురం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన ‘డోర్ టు డోర్’ కార్యక్రమం నర్సాపురం పట్టణంలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం పట్టణంలోని 7, 23వ వార్డుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు.
అమరావతిని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని నాయకులు అన్నారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంకు భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకులు భోగిరెడ్డి ముత్యం, కోటిపల్లి గోపాలకృష్ణ (వార్డు కన్వీనర్), రావి అప్పాజీ, లక్ష్మణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
