పగిలిన మంచినీటి పైప్‌లైన్‌తో నీటి వృథా..
- వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్
దుర్గి, ఆంధ్రప్రభ : దుర్గి గ్రామ పంచాయతీ పరిధి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆర్అండ్బి రోడ్డుకు ఆనుకుని ఉన్న మంచినీటి మె యిన్ పైప్ లైన్ పగిలిపోవడం తో పెద్ద ఎత్తున తాగునీరు వృ థాగా పారుతోంది. పలువురు రోజులుగా పైప్ లీకేజీ కొనసాగు తున్నప్పటికీ సంబంధిత అధికా రులు స్పందించకపోవ డంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్ లైన్ నుంచి నిరంతరం నీరు బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. లీకేజీ కారణంగా మంచినీరు మురుగునీటితో కలిసిపోయే పరిస్థితి ఏర్పడటం తో ప్రజలు ఆ నీటిని వినియో గించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి వృథాతో పాటు పారిశుధ్య సమస్యలు, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీసెక్రటరీ, ప్ర త్యేక అధికారి, పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి పగిలిన మెయిన్ పైప్ లైన్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టా లని, ప్రజలకు స్వచ్ఛమైన తా గునీరు అందేలా చర్యలు తీ సుకోవాలని గ్రామస్థులు కోరు తున్నారు.
