పర్యావరణ స్థిరత్వం, ఉద్యోగుల భద్రత పట్ల కట్టుబాటును బలపరిచిన ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : ఎల్‌ఈడీ డిస్ప్లే, లైటింగ్‌ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థ అయిన ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ప్రముఖ ఐఎస్‌ఓ 14001:2015 (పర్యావరణ నిర్వహణ వ్యవస్థ) ఐఎస్‌ఓ 45001:2018 (ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత నిర్వహణ వ్యవస్థ ) అంతర్జాతీయ ప్రమాణపత్రాలను అందుకున్నట్లు గర్వంగా ప్రకటించింది.

ఈ గ్లోబల్‌ గుర్తింపులు ఎంఐసీ సంస్థ తన ఆపరేషన్లలో స్థిరత్వం, ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న అఖండ నిబద్ధతకు కీలక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఈ ద్వంద్వ గుర్తింపు సంస్థ పర్యావరణ పరిరక్షణలో నిబద్ధతను, ఉద్యోగుల సంక్షేమంపై నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తుంది.

ఈసందర్భంగా ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌ సీఈఓ రక్షిత్‌ మథూర్‌ మాట్లాడుతూ… స్థిరత్వం, తమ ఉద్యోగుల భద్రత ఎప్పుడూ ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌ గుండెతుంటుగా ఉన్నాయన్నారు. ఈ సర్టిఫికేషన్లు తమ బృందం చేసిన కృషికి, నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయన్నారు. మన పరిసరాలపై, మన ఉద్యోగులపై, మన సమాజంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తాము తీసుకుంటున్న ప్రయత్నాలకు ఇవి ఒక గుర్తింపుగా ఉన్నాయన్నారు. ఇది మమ్మల్ని మరింత బాధ్యత గల పరిశ్రమలో మార్గదర్శకులుగా ముందుకు నడిపేందుకు ప్రేరేపిస్తోందన్నారు.

Leave a Reply