Parliament | నీట్ రగడతో సభల్లో రచ్చ…
పార్లమెంట్‌లో మరోసారి గందరగోళం
Parliament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరో రోజూ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్ష వివాదం, లాఠీచార్జీ ఘటనపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు సజావుగా సాగలేదు. సభలో నినాదాలు, ఆందోళనల మధ్య స్పీకర్, ఛైర్మన్ పలుమార్లు సభ్యులను శాంతించాలని కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ఉభయ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా, పరీక్షల్లో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే సభల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఆసక్తి నెలకొంది.
