chief minister|అబ్దుల్ కలాంకు రేవంత్ నివాళి
chief minister|అబ్దుల్ కలాంకు రేవంత్ నివాళి
నిరాడంబరతకు ప్రతీకగా కలాం జీవితం
శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు చిరస్మరణీయం: సీఎం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధికి డాక్టర్ కలాం అందించిన విశిష్ట సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా డాక్టర్ అబ్దుల్ కలాం చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభ, అచంచల దేశభక్తి ప్రతి భారతీయుడికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
