ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సకాలంలో పూర్తి చేయాలి: సర్పంచ్

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం పీఎస్ నంబర్లు 258, 259 పరిధిలో ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను గ్రామ సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి–వెంకట్రావు పరిశీలించి, బీఎల్ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను సవరించి, ప్రతి అర్హుడైన ఓటరికి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణను 100 శాతం సకాలంలో పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పకిడే రాజయ్య, బీఎల్ఓలు చిరంజీవి, రజియా, బీఎల్ఏ కృష్ణమూర్తి, ఓటర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.