కృష్ణ శతకం

  1. గోపకులముగాచ గోవర్ధనము నెత్తు
    సాహసుడవు పార్థసారధివయ
    పిట్టకొంచెమైన పాట ఘనమగును
    గీతదాత నీకు కేలుమోడ్తు
  2. గురువయూరులోన కొలువైన గోకుల
    రక్షచేయువాడ భిక్షపెట్టి
    ఏమి జపము చేరు ఏ తపమ్మునుజేతు
    గీతదాత నీకు కేలుమోడ్తు
  3. పంచపాండవులకు పంచగ్రామములను
    పంచి ఇమ్మనుటను ప్రజ్ఞ కలదు
    అలవిలేనియట్టి తెలివితేటలు సొత్తు
    గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *