డీసీపీని సన్మానించిన ఇంపాక్ట్ ట్రైనర్లు
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా డీసీపీని అగ్గిడి భాస్కర్ ను ఆఫీసులో ఇంపాక్ట్ ట్రేనర్లు శాలువా కప్పి సన్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ సర్టిఫైడ్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ ట్రైనర్లు మండలంలోని కొత్తూరుపల్లె వాసి కానిగంటి లక్ష్మణ్ వర్మ, అగూడ తిరుపతి, రాపల్లి రాజన్న, రాజేశం కుమ్మరి కార్యాలయంలో జిల్లా డీసీపీ అగ్గిడి భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా సన్మానించారు.
ఈ సందర్భంగా ట్రేనర్లు మాట్లాడుతూ… జిల్లాలో చేపట్టనున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలపై డీసీపీతో చర్చించామన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సహకారంతో పాఠశాలల్లో కళాశాలల్లో,గ్రామాల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
