BRS Yuva Sangrama Sabha | భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేత‌ల విమర్శలు
యువ హామీల అమలుపై ప్రశ్నలు

BRS Yuva Sangrama Sabha | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించిన ‘యువ సంగ్రామ సభ’కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన వంటి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్టీ డిమాండ్ చేసింది.

ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై పార్టీ తన వైఖరిని ప్రజలకు వివరించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వాటిపై ప్రభుత్వాన్ని జవాబుదారిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.