దళారులకు కాదు.. రైతు సంఘానికే పంటలు అమ్మాలి

  • రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం 10వ వార్షిక మహాసభ
  • ఎఫ్‌పీఓల ద్వారా విక్రయిస్తే రైతులకు అధిక లాభాలు: రిజ్వానా

రాప్తాడు, ఆంధ్రప్రభ : రైతులు పండించే పంటలను దళారులకు మధ్యవర్తులకు అరా కొరా ధరలకు అమ్మ వద్దని ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ కోఆర్డినేటర్ రిజ్వానా పేర్కొన్నారు. రాప్తాడు మండల రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ 10వ వార్షిక మహాసభను ఎం.బండమీదపల్లి హై స్కూల్ నందు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎఫ్ ఎకాలజీ సెంట్రల్ ఆఫీస్ ఏ ఎల్పీ కో ఆర్డినేటర్ రిజ్వనా హాజరయ్యారు. ముందుగా మండల అధ్యక్ష కార్యదర్శి, ఎఫ్ ఫిఓ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం సమావేశంలో కోఆర్డినేటర్ రిజ్వాన ఎంటీఎల్ మల్లేష్ మాట్లాడుతూ పంట కొనుగోలు మరియు అమ్మకాల్లో దళారుల చేతుల్లో రైతులు మోసపోతూనే ఉన్నారు.

అందువలన రైతుల కోసం ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టిందని తెలిపారు.ఈ పద్ధతులను ప్రతి రైతు తప్పకుండా పాటించాలని సూచించారు. ఎఫ్ పి ఓ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం సరైన యంత్ర సామాగ్రి లేకపోవడం సరైన పనిముట్లు అందుబాటులో లేకపోవడం సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఒక్కొక్కరిగా పరిష్కరించుకోవడానికి సాధ్యపడదు.కాబట్టి రైతులు అందరిని ఒక తాటిపైకి తెచ్చి వారందరినీ ఉమ్మడి చేసి రైతు సంఘం ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాకుండా ఈ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం అనేది మీ అందరిదీ కాదు కనుక దీన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వ్యాపార లావాదేవీలు నిర్వహించినప్పుడే ఈ సహకారం సంఘం అనేది లాభాల బాటలో మరియు అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా రైతు తాను పండించిన పంటను మధ్యవర్తులకు దళారీలకు మరియు వ్యాపారస్థులకు అమ్మ కూడదు.పంటను దళారులకు మధ్యవర్తులకు అమ్మడం వలన సంచికి రూ.30 నష్టపోతున్నారు. అదే రైతు సంఘం కి అమ్మితే ఆడబ్బులు మీకే వస్తాయని చెప్పారు. దళారులకు అమ్మితే తూకాల్లో మోసం చేస్తున్నారు.

అదే రైతు సంఘంలో అయితే మీరే తూకం వెయ్యవచ్చు అని అన్నారు. వ్యాపారస్థులకు అమ్మితే కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే రైతు సంఘం కి అమ్మితే కమీషన్లు ఉండవు అన్నారు. రైతు తమ పంటలను ఎఫ్ పి ఓ ద్వారా కొనుగోలు చేసి గ్రేడింగ్ చేసి పెద్ద మార్కెట్లకు అమ్మడం చేయాలన్నారు.ఇలా చేయడం ద్వారా వచ్చిన లాభాలను తిరిగి వాటాదారులకు బోనస్ రూపం లో ఇవ్వవచ్చు అన్నారు.ప్రతి వాటాదరుడు ఎఫ్ పి ఓ వ్యాపార కార్యక్రమాలలో నెల నెల ఖచ్చితంగా రూ.1500 వస్తువులు రైతు అంగడిలో కొనుగోలు చేయాలి.వాటాదరుడు పండించిన పంటను ఎఫ్ పి ఓ కి 10 క్వింటాలు అమ్మాలి.

అదే విధంగా రైతులు పండించి పంటలో ఎంతో కొంత స్వచ్చంధంగా ఇచ్చి ఎఫ్ పి ఓ అభివృద్ధికి సహకరించాలి అని తెలియజేశారు. వచ్చే మహాసభకు వాటాదారులలో 1/6 వ వంతు వస్తే సభ్యుల ఆమోదం పొందినట్లు అని అన్నారు. అదేవిధంగా నీంషోప్ మరియు రైతునేస్తం ప్రొడక్ట్స్ గురుంచి వివరించారు.2025-26 ఆడిట్ నివేదికను కళ్యాణ్ చదివి వినిపించారు.ఆడిట్ రిపోర్ట్ ను సభ్యులందరు ఆమోదం తెలపారు. 2026-27 భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అనురాధ చదివి వినిపించారు. అనంతరం రైతులు పండించిన పంటలు ఎఫ్ పి ఓ కు అమ్మిన వాళ్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎంటిఎల్ మల్లేష్ మేనేజర్లు రమేష్ కళ్యాణ్ సిఈఓ దిలీప్ ఎస్ టి ఓలు విక్రమ్ నిహారిక జయలక్ష్మి ఏఈఏ అత్తర్ బిఓడి సభ్యులు సునీత పురుషోత్తం రెడ్డి బాబయ్య కొండారెడ్డి ఎకాలజీ మండల సిబ్బంది పాల్గొన్నారు.