సాగు చేసిన పంటకే ప్రీమియం చెల్లించాలి..

  • జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సూచన

కర్నూలు, ఆంధ్రప్రభ : నాన్‌లోనీ రైతులు (రుణం తీసుకోని రైతులు) వాతావరణ పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పత్తి, వేరుశనగ పంటలను అధికంగా సాగు చేస్తున్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

లోనీ రైతులు (రుణం తీసుకున్న రైతులు) కూడా ఇప్పటికే ప్రకటించిన విధంగా జులై 31వ తేదీ వరకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉందని, వారు కూడా గడువులోగా బీమా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు. రైతులు తాము సాగు చేసిన పంటకే బీమా ప్రీమియం చెల్లించాలని, ఇతర పంటలకు ప్రీమియం చెల్లించరాదని స్పష్టం చేశారు.

మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ విషయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.