Hyd Water Supply | హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ నీరు
సింగూర్, మంజీరలో తగ్గుతున్న నీటి నిల్వలు..
రోజుకు అదనంగా 25–30 ఎంజీడీల సరఫరాకు జలమండలి కార్యాచరణ
Hyd Water Supply |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మల్లన్నసాగర్ జలాశయం నుంచి రోజుకు అదనంగా 25–30 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీలు) నీటిని తరలించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) నిర్ణయించింది. సింగూర్, మంజీర జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది.
మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా మల్లన్నసాగర్ నీటిని హైదరాబాద్‌కు మళ్లించేందుకు సుమారు 4 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లభించాయి. ఈ పనులను 50 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగినా నగరంలో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ జల వనరులను వినియోగించేందుకు జలమండలి కార్యాచరణ చేపట్టింది. అలాగే నగరానికి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రోజువారీ అవసరాలు, భవిష్యత్ డిమాండ్‌పై సమగ్ర అంచనా వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
