బీజేపీ ఆధ్వర్యంలో సర్ హెల్ప్‌లైన్ శిబిరం

  • ప్రజలకు విస్తృతంగా సేవలు
  • బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు

ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పలు డివిజన్‌లు , గ్రామాలలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు ఆదేశాల మేరకు సర్ కార్యక్రమానికి సంబంధించిన హెల్ప్‌లైన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్ ఫారాలు నింపుకోవాల్సిన ప్రజలు పెద్ద సంఖ్యలో డివిజన్‌లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ శిబిరానికి తరలివచ్చి, బీజేపీ కార్యకర్తల సహకారంతో తమ సర్ దరఖాస్తు ఫారాలను సక్రమంగా నింపి అందజేస్తున్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సర్ ప్రక్రియను సులభతరం చేయడమే హెల్ప్‌లైన్ శిబిరం ముఖ్య ఉద్దేశమని తాండ్ర వినోద్ రావు తెలిపారు. ఇంకా ఫారాలు నింపుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలే ముందు… దేశమే ప్రధానం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలనే లక్ష్యంతో తమ బృందం 16కు పైగా ప్రాంతాల్లో ఒకేసారి సర్ సహాయ కేంద్రాలను నిర్వహిస్తోందనీ తాండ్ర వినోద రావు పేర్కొన్నారు. గౌతంపూర్ నుంచి నవభారత్ వరకు బీజేపీ కార్యకర్తలు ప్రజలకు సర్ ప్రక్రియలో సహాయం చేస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ నిరంతరం సేవలందిస్తున్నారనీ అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అన్ని ప్రాంతాల నుంచి విశేషంగా స్పందిస్తూ ముందుకు వస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

ప్రజల సేవే మా సంకల్పం.. మీ విశ్వాసమే మా బలం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” స్ఫూర్తితో, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, ప్రతి ఓటు విలువను కాపాడేలా మనమందరం కలిసి పనిచేద్దామని తాండ్ర వినోద్ రావు స్పష్టం చేశారు.