ఆర్టీసీ జేఏసీ నాయకులు అండగా ఉంటా – బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రభుత్వ విప్, సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేశారు.ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.