బాసర బాలాలయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రత్యేక పూజలు
బాసర (ఆంధ్రప్రభ): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య గురువారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించి, హారతి ఇచ్చి ఆశీర్వచనం అందజేశారు.
వేద ఆశీర్వచన మండపంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను భక్కి వెంకటయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
