విచారణ నివేదిక కలెక్టరుకు అందజేస్తా..
డీఆర్డీఓ కిషన్..
జన్నారం,ఆంధ్రప్రభ: తిమ్మాపూర్ ప్రభుత్వ బడిలో జరిగిన ఘటనపై విచారణ నిర్వహించానని,ఆ విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు మంచిర్యాల డీఆర్డీఓ కిషన్ చెప్పారు. మండలంలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై బుధవారం మధ్యాహ్నం ఆ పాఠశాల ఆవరణలో డీఆర్డీఓ కిషన్ విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను, ముగ్గురు ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను వేర్వేరుగా వివరాలు అడిగి ఆయన లిఖితపూర్వకంగా రాసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, వారంలోగా ఆ విచారణ నివేదికను కలెక్టర్ కు ఇవ్వనున్నామన్నారు. ఆయన వెంట స్థానిక ఎంఈఓ బానావత్ రాజేందర్,ఏఎస్సై ఉమేష్ కుమార్, తదితరులున్నారు.
