NEWS@3:00 A.M | 13 జూలై 2026 ముఖ్యాంశాలు

El-Nino‍-Effect : అంపశయ్యపై నారుమడి Andhra Prabha Top Story

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : El-Nino‍-Effect : దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఈరోజు కన్నీరు పెడుతున్నాడు. చెమటోడ్చి పండించే పంటకు ఆరంభంలోనే కష్టాల సుడిగుండం ఎదురైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ఎంతో ఆశతో ఆకు మడులు (నారుమళ్లు) పోశారు. విత్తనాలు మొలకెత్తి పచ్చగా పైకి లేస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. సరైన వర్షాలు లేక, కాలువల్లో నీరు విడుదల కాక ఆకు మడులు కళ్ల ముందే ఎండిపోతుంటే, వాటిని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి. click here to read full news

Micro Habits | ఈ గోరంతలే.. కొండంత మార్పునకు పునాది!

Micro Habits | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే భారీ లక్ష్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులే దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిన్న అలవాట్లనే మైక్రో హ్యాబిట్స్ అని పిలుస్తారు. వీటిని రోజూ పాటించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శారీరక ఆరోగ్యం కూడా పెరుగుతాయి. రోజు ప్రారంభమే ఎంతో కీలకం.  click here to read full news

festival | శివనామస్మరణతో మార్మోగిన క్షేత్రం

festival | నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. click here to read full news

Odisha | భ‌ర్త మృతి..

Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స అనంతరం మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. click here to read full news

temple-arudra | శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో…

temple-arudra | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థాన శివాలయంలో సోమవారం శివుని జన్మ ఆరుద్ర నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. click here to read full news

Rayalaseema Lift Irrigation | చంద్రబాబుపై సజ్జల ఫైర్..

Rayalaseema Lift Irrigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు. click here to read full news

Coal Block | సింగరేణిపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కిషన్‌రెడ్డి సవాల్

Coal Block | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ సింగరేణి భరోసా యాత్ర లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. click here to read full news

Lenin Collections | బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అఖిల్ చిత్రం..

Lenin Collections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కమర్షియల్ విజయాన్ని ఎట్టకేలకు ‘లెనిన్’ రూపంలో అందుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ పీరియాడిక్ రూరల్ రివెంజ్ డ్రామా విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. click here to read full news