Nirmal | మహిళా సర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌..!

నిర్మల్‌లో విషాదం
Nirmal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఇవాళ‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆత్మహత్యకు గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.