కృతజ్ఞతతో సిఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

జైనూర్, ఆంధ్రప్రభ : మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్‌కు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మాంగ్ సమాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెరమేరి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

మాంగ్ సమాజ్ కెరమేరి మండల కమిటీ ఆధ్వర్యంలో, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహాలే దత్త మాంగ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహాలే దత్త మాంగ్ మాట్లాడుతూ, ఇకపై మాంగ్ కులం పేరుతో తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే బి. సాగర్ మాంగ్, ఎం. అంకుష్ మాంగ్, డి. ఆకాష్ మాంగ్, ఎం. శ్రీహరి మాంగ్, జి. తిరుపతి మాంగ్, కె. భుజంగ్ మాంగ్, డి. కిరణ్ మాంగ్‌తో పాటు మాంగ్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.