నంద్యాల జిల్లాకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం..
రూ.15 వేల విలువైన క్యాన్సర్ పరీక్షలు ఉచితం బసవతారకం వైద్య బృందం నెహ్రూ నగర్‌లో
హీరో బాలకృష్ణ మానవత్వం నంద్యాల ప్రజలకు మెగా వైద్య సేవలు అందించిన ఎంపీ శబరి
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశంలోనే పేరెన్నికగన్న హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నంద్యాల జిల్లా ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆదివారం నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఎంపీ డా. బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో ఒక పరీక్షకు రూ.15 వేల విలువగల ఉచిత క్యాన్సర్ పరీక్షల మహా మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభ సభలో నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఇటీవల తాను విజయవాడకు వెళ్లిన సందర్భంలో తెలుగు ప్రజల అభిమాని హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ ఎదురుపడగా నంద్యాల జిల్లాలో క్యాన్సర్ రోగ బాధితులు అధికంగా ఉన్నారని చెప్పారు. వెంటనే స్పందించిన హీరో బాలకృష్ణ ప్రత్యేకంగా ఉచితంగా క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయిద్దామని తెలిపి అందుకు అవసరమైన వైద్య బృందం, విలువైన పరీక్షల ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయించారు.
నంద్యాల జిల్లా ప్రజల తరపున హీరో బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ డా. బైరెడ్డి శబరి అన్నారు.నెహ్రూనగర్ లో మొదటి వైద్య శిబిరం ఏర్పాటుకు కారణం నెహ్రూ నగర్ మాజీ గ్రామ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు హీరో బాలకృష్ణ వీరాభిమాని కట్టుబడి శ్రీనివాస నాయుడు.ఆయన పెళ్లి వేడుక కన్నా హీరో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అందువల్లే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కన పది గ్రామాల వారికి వైద్య సేవలు అందిస్తున్నామని ఎంపీ డా. బైరెడ్డి శబరి తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వచ్చిన హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ వైద్య బృందం సిబ్బంది స్థానిక వైద్య బృందం వాలంటీర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎంపీ డా బైరెడ్డి శబరి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నందికొట్కూరు హీరో బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు తిమ్మారెడ్డి బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్ టీడీపీ నాయకులు వెంకటేశ్వరశర్మ, బంగారు వెంకటేశ్వర్లు గుణశేఖర్ రెడ్డి రఘురామిరెడ్డి పారుమంచాల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
