ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు..
- ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణంలోని తెనుగు వాడలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాల సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యలను ఆలయ నిర్వాహకులు సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూతగడ్డ సంపత్, గంగుల సంతోష్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
