KTR Revanth Water Politics | నీళ్లు ఇవ్వకుండా పాలిటిక్స్
రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
KTR Revanth Water Politics | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో సాగునీటి సమస్య, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు నీరు అందించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన కేటీఆర్.. రైతులు సాగునీరు కోరితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. “రైతులకు నీళ్లు ఇవ్వండి.. అవసరమైతే మా రక్తాన్ని తీసుకోండి” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన త్యాగాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కాల్పులు, ప్రాణత్యాగాలను గుర్తుచేసిన కేటీఆర్.. రైతుల పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు అవసరమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
