జుక్కల్ లో జోరుగా ఎస్ఐఆర్ ఫారాల స్వీకరణ
- గ్రామ చవాడిలో అందుబాటులో అధికారులు
జుక్కల్, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్) సర్వేను విజయవంతం కోసం జుక్కల్ మండల కేంద్రంలో అధికారులు ఆదివారం అయినప్పటికీ నడిబొడ్డున చవాడి(జొన్నలు బజారు)లో అందుబాటులో ఉండి ఎస్ఐఆర్ ఫారాలను స్వీకరించటమే కాకుండా తమ చారవాణిలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ చెయ్యటంతో మద్యాహ్నం వరకు 2వందలకు పైగా ఓటర్లు తమ ఫారాలను పూర్తి చేసి ఇవ్వటం జరిగింది.జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిఎల్ఓలు శ్రీకాంత్,రాజు సర్,ఖండేరావు,మారుతి తమ సేవలను వేగవంతం చేశారు,సూపర్వైజర్ సాయి ప్రసాద్ ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించారు.
జుక్కల్ ఉప సర్పంచ్ షేక్ ఫీర్దోస్,సర్పంచ్ భర్త కె.సాయగౌడ్ సయితం ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ఎస్ఐఆర్ సద్వినియోగం గురించి ప్రజలకు ఇంకా అవగాహన కల్పించారు.ఆదివారం కావటం అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో గ్రామస్తులు సైతం తమ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఎస్ఐఆర్ ను సద్వినియోగం చేసుకున్నారు. జుక్కల్ మండలంలో ఇప్పటివరకు 60 శాతం ఎస్ఐఆర్ పూర్తయిందని సూపర్వైజర్ సాయిప్రసాద్ తెలిపారు. ప్రజలు తమవంతు సహకారం అందించి తమ అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు.
