S Janaki | క్యాంప్ కార్యాలయంలో ఎస్‌.జాన‌కి సేవలు స్మ‌ర‌ణ

S Janaki | ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ నేపథ్య గాయని, గాన కోకిల ఎస్. జానకి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. తన క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలుగు నేలపై జన్మించిన ఎస్. జానకి ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆమె ఆలపించిన ఎన్నో అజరామర గీతాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్న చంద్రబాబు, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.