Kishan Reddy | గోల్నాకలో కిషన్‌రెడ్డి పాదయాత్ర..

Kishan Reddy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గోల్నాక బస్తీ, కాలనీ ప్రాంతంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికుల మధ్యకు వెళ్లిన కిషన్‌రెడ్డి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పాదయాత్ర అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని, స్వచ్ఛతను సామాజిక బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.