ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
- మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా
చిట్యాల, ఆంధ్రప్రభ : సర్ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ సూచించారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ తమ కుటుంబ సభ్యుల ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎనిమరేషన్ ఫారాలను స్థానిక తహసిల్దార్ విజయకుమార్ కు చైర్మన్ పందిరి గీతా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీతా మాట్లాడుతూ చిట్యాల పట్టణంలో గల అన్ని వార్డులలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను చైర్మన్ పందిరి గీతా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బి ఎల్ ఓ లు బి ఎల్ ఏ లు బాధ్యతాయుతంగా పనిచేసి కార్యక్రమం సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఆన్లైన్ నమోదు వేగవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు ఓటు హక్కు కలిగే విధంగా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ చైర్మన్ పందిరి శ్రీనివాస్, తహసిల్దార్ విజయకుమార్, ఆర్ ఐ షరీఫ్, బి ఎల్ ఓ కృష్ణకుమారి, పట్టేడి దివ్య తదితరులు పాల్గొన్నారు.
