సిద్ధాపూర్ లో ఉద్రిక్తత వాతావరణం
గ్రామస్థులను అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదం
కొత్తూరు, ఆంధ్రప్రభ : కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో శుక్రవారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డు వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకని సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల్లో తరలివెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
