Etela Rajender | ప్రభుత్వంపై ఈటల ప్రశ్నల వర్షం
Etela Rajender |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
“నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం” అని ఈటల స్పష్టం చేశారు. రాజకీయాల పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉత్తర తెలంగాణకు మిడ్ మానేరు నీటి జంక్షన్‌గా కీలకమైనదని పేర్కొన్న ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కరవు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
లో-లెవల్ పాయింట్‌కు చేరుతున్న నీటిని ఎందుకు ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించిన ఈటల, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
