రూ.22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కుల, మత, పార్టీలు చూడకుండా పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కుల, మత, పార్టీలు చూడకుండా పేదలకు అండగా నిలుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి నియోజకవర్గానికి చెందిన 29 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ.22 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. గత 25 నెలల్లో గుడివాడ నియోజకవర్గానికి రూ.6.80 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆస్పత్రి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.