శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరు
సిరికొండ, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిమన్‌పల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.5 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి శుక్రవారం ప్రొసీడింగ్ పత్రాన్ని గ్రామ సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సర్పంచ్, ఉప సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందులాల్, రాజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
