ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్ బాల్ పోటీలు
- ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని చిన్ని
- నాలుగు రోజులపాటు జరగనున్న పోటీలు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని పటమట హై స్కూల్ నందు 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా పోటీలలో పాల్గొన్న బాల బాలికలకు అభినందనలు తెలియజేశారు. ఇంత అత్యద్భుతంగా పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను సైతం అభినందించారు. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడలలో బాస్కెట్బాల్ ఒకటని ఈ పోటీలు రోజుకు 20 మ్యాచ్లు జరుగుతున్నాయని నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ప్రతి ఒక్క జట్టు కష్టపడి విజయం సాధించి కప్పు గెలవాలని ఎంపీ చిన్ని ఆకాంక్షించారు.
అనంతరం ప్రతి టీం సభ్యులతో ఎంపీ చిన్ని కరచాలనం చేస్తూ మాట్లాడారు భవిష్యత్తులో మరిన్ని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు విజయవాడ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోస్, సెక్రటరీ రాజ్ కుమార్, స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ చక్రవర్తి టెక్నికల్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు పటమట హై స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యలమంచిలి రవి తదితరులు పాల్గొన్నారు.
