వేగవంతంగా సీడం శంభు విగ్రహ ఏర్పాట్ల పనులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడి గూడ లో ఆదివాసి తొలి ఉద్యమ నేత స్వర్గీయ సీడం శంభు విగ్రహ ఏర్పాట్లు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ పనులను ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్ రావు, బీఆర్ఎస్ నాయకులు సీడం సోనే రావు పరిశీలించారు.
జులై 20న సీడం శంభు 8 వర్ధంతి ఉండడంతో ఈ విగ్రహ ప్రతిష్టాపన పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు నాయకులు ప్రత్యేక చోరవతో విగ్రహ పనులు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీపీ జైవంతరావు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోపంద్ర ఆనందరావు, సీడం జంగు, సీడం జంగు దేవ్, ఆత్రం దేవు శావ్, కొడప శ్యామ్, సీడం మహదు,గోపాల్, మోహన్, గణేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
