bjp| శంషాబాద్‌లో జేపీ నడ్డాకు ఘన స్వాగతం
bjp| శంషాబాద్‌లో జేపీ నడ్డాకు ఘన స్వాగతం
తెలంగాణ పర్యటనకు కేంద్ర మంత్రి
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులపై సమీక్ష..
అధికారులతో కీలక సమావేశం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ..
సాయంత్రం మేధావులతో సమావేశం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నిమిత్తం గురువారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్టీ ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా నడ్డా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రి అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పనుల వేగవంతం, వైద్య సేవల విస్తరణపై చర్చించనున్నారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని పలు అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
