సీఎంను కలిసిన మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ

మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కాసోజు శంకరమ్మ బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై నమ్మకం ఉంచి మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.మహిళల సంక్షేమం, సాధికారత కోసం కమిషన్ సభ్యురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని శంకరమ్మ పేర్కొన్నారు.