tarun bhaskar| ఎయిర్‌పోర్టులో వారిద్ద‌రూ.. పెళ్లి ప్రచారం

tarun bhaskar| ఎయిర్‌పోర్టులో వారిద్ద‌రూ.. పెళ్లి ప్రచారం

హైదరాబాద్ విమానాశ్రయంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా..

ప్రేమ, పెళ్లిపై మరోసారి చర్చ
‘ఈషా నాకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ’ అన్న తరుణ్ వ్యాఖ్యలు మరోసారి వైరల్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు నటి ఈషా రెబ్బా మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ సినీ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఇద్దరూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఇద్దరూ కలిసి కనిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో మరోసారి వీరి వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన తరుణ్ భాస్కర్, “ఈషా నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు.. అంతకంటే ప్రత్యేకమైన వ్యక్తి. సరైన సమయంలో అన్ని విషయాలు చెబుతాను” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించగా, ఇప్పుడు ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే, వీరి పెళ్లిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలకే పరిమితమైంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను ధృవీకరించలేమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.