ipl table|ప్లే ఆఫ్స్ రేసులో..?

ipl table|ప్లే ఆఫ్స్ రేసులో..?

ipl table| టాప్‌లో పంజాబ్‌.. లాస్ట్‌లో కోల్‌క‌తా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసింది. ఇక ఇప్పుడు అన్నీ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టి నుంచి విజ‌యాలు సాధించ‌క‌పోతే ఇంటి దారి ప‌ట్టాల్సిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కు టేబుట్ టాప్‌లో ఎవ‌రు ఉన్నారు. ఎవ‌రు లాస్ట్‌లో ఉన్నార‌నేది తెలుసుకుందాం.

టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. ఈ జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఆరు మ్యాచుల్లో 5 విజ‌యాలు సాధించింది. ఒక మ్యాచ్ ర‌ద్ద‌య్యింది. ఇంత వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఈ జ‌ట్టు ఓడిపోలేదు. అలాగే రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు మూడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు విజ‌యం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఈ జ‌ట్టు ఏడు మ్యాచుల్లో నాలుగు విజ‌యాలు సాధించింది. చైన్నైలో ఐదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో మూడు విజ‌యాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో ఉంది. ఆరు మ్యాచుల్లో మూడు విజ‌యాలు సాధించింది. గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఇక ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచిన ముంబై ఇండియన్స్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణ పరాభవాలను మూటగట్టుకుంటోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ముంబై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. గుజరాత్‌పై కమ్ బ్యాక్ ఇచ్చింది అనుకునేలోపే సీఎస్కేపై చిత్తుగా ఓడిపోయింది.కింది నుంచి వరుసగా రెండు స్థానాల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ల‌క్నో ఏడు మ్యాచుల్లో రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించింది. ఇక ఆఖ‌రి స్థానంలో ఉన్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఏడు మ్యాచుల్లో విజ‌యం సాధించి ఒకే ఒక్క మ్యాచులో విజ‌యం సాధించింది.

Leave a Reply