ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామంలో సర్పంచ్ మెస్ కార్తీక్ చొరవతో నిజామాబాద్‌కు చెందిన మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత పరీక్షలు, ఈసీజీతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మెస్ కార్తీక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించగా, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై సేవలను వినియోగించుకున్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సర్పంచ్ మెస్ కార్తీక్‌తో పాటు వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడేళ్ల బాలయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వైద్య బృందం, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
