ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా నిలవాలి: గజానంద్ దేశాయి

డోంగ్లి (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి సూచించారు. బుధవారం గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, నమోదు అవుతున్న దరఖాస్తులు, ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించారు. అలాగే పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గజానంద్ దేశాయి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు మిస్ కాకుండా, కొత్త ఓటర్ల నమోదు సక్రమంగా జరిగేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుజాత శివారెడ్డి, దోతి సర్పంచ్ సంగ్రామ్ పటేల్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, నాయకులు విలాస్ గైక్వాడ్, సాయిలుగోండా తదితరులు పాల్గొన్నారు.