పాలడుగు చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా పసునూరి ప్రభాకర్
మోత్కూర్, ఆంద్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10న జరగనున్న చేనేత సహకార ఎన్నికల్లో భాగంగా మోత్కూరు మండలం పాలడుగు చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. సోమవారం సాయంత్రం వరకు నామినేషన్ల గడువు ముగియడంతో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
అధ్యక్షులుగా పసునూరి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శిగా మూషం సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మూషం స్వామి తో పాటు డైరెక్టర్లుగా మూషం స్వామి, గోశిక నరేందర్ , జెల్లా సులోచన, గుండు కళావతి ,జెల్లా మురళి, మూషం శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి మారోజు శ్రీనివాస్ , పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పసునూరి ప్రభాకర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందన్నారు.
