డ్రగ్స్ పై సర్పంచులకు అవగాహన సదస్సు

చిట్యాల, ఆంధ్రప్రభ: డ్రగ్స్ నిర్మూలన మాదకద్రవ్యాల వినియోగంపై మండలంలోని సర్పంచులకు మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండవ ఎస్ఐ రాజన్ కుమార్, మాట్లా డుతూ, సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల సరఫరా చేసినా, విక్రయించిన, విని యోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత మండలంగా చిట్యాలను మా ర్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.