Sensex | నాలుగు రోజుల లాభాలకు విరామం
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గత నాలుగు సెషన్లుగా లాభాల్లో కొనసాగిన ప్రధాన సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, మెటల్, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ముగింపు సమయానికి సెన్సెక్స్ 104.35 పాయింట్లు నష్టపోయి 78,180.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.65 పాయింట్లు తగ్గి 24,398.70 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్, ఎటర్నల్, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. ట్రెంట్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.94గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.74 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్స్ ధర 4,137 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
