New Appointments | ఎపిలోని ప‌లు వ‌ర్శిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్ లు నియామ‌కం …..

అమరావతి: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియ‌మించారు.. ఈ మేర‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్ పూర్ గణితశాస్త్ర ఆచార్యునిగా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ ను నియమించారు. ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ పి. ప్రకాశబాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్లపాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.

వర్సిటీలు – నూతన వీసీలు
ఆంధ్రా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్
కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్
యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ పి. ప్రకాశబాబు

  • రాయలసీమ వర్సిటీ – వెంకట బసవరావు
  • అనంతపురం జేఎన్టీయూ హెచ్.సుదర్శనరావు
  • తిరుమల పద్మావతి మహిళా వర్సిటీ – ఉమ
    మచిలీపట్నం కృష్ణా వర్సిటీ – కె.రాంజీ
  • ఆదికవి నన్నయ వర్సిటీ – ప్రసన్న శ్రీ
  • విక్రమ సింహపురి వర్సిటీ – అల్లం శ్రీనివాసరావు

Leave a Reply